LG ఫోన్స్ కి గడ్డు కాలం

Lg ప్రపంచం లో ఉన్న పెద్ద బ్రాండ్స్ లో ఒకటి . Lg ఎలక్ట్రానిక్ పరికరాలు తయారు చేస్తూ ఉంటుంది . Lg ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ప్రపంచ మార్కెట్ లో బాగానే అమ్ముడు పోతున్నాయి . కానీ Lg మొబైల్స్ ఫోన్స్ విభాగం లో మాత్రం చాలా సమస్యలు ఎదురుకుంటుంది . lg గత 11 క్వార్టర్ లో కేవలం క్వార్టర్ 1 2017 ( Q1 2017 ) లో మాత్రమే లాభాలలో ఉంది. గత 3 సంవత్సరాల నుంచి lg మొబైల్స్ బిజినెస్ నష్టాలలో నడుస్తుంది . 2017 lg కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా కేవలం 1.39 కోట్ల ఫోన్స్ మాత్రమే అమ్ముడు పోయాయి .

Read In English

ఇంక వార్త లోకి వెళితే lg చైనా లో తన మొబైల్స్ ఫోన్స్ విడుదల ఆపివేసింది . lg 2017 లో ఒక మొబైల్ కూడా చైనా మార్కెట్ లో విడుదల చేయలేదు . దీని కి కారణం అక్కడ ఉన్న చైనా కంపెనీస్ పోటీ ని తట్టుకోలేకపోయింది . దీనికి పెద్దగా ఆశ్చర్య పడవలిసిన అవసరం లేదు , ఎందుకంటే ఇప్పుడు మన ఇండియా లో కూడా ఎక్కువ అమ్ముడు పోతున్న మొబైల్స్ కూడా చైనా కంపెనీస్ మొబైల్స్ ఫోన్స్ మాత్రమే.

lg 2016 లో చైనా లో 48 కోట్ల మొబైల్స్ పంపిణి చేస్తే దాని లో కేవలం లక్ష 60 (1,60,000) ఫోన్స్ మాత్రమే చైనా మార్కెట్ లో అమ్ముడు పోయాయి.

దీన్ని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు చైనా లో lg కంపెనీస్ మొబైల్స్ పరిస్థితి ఏంటి అని . చైనా లో నే కాదు అమెరికా లో కూడా ఆపిల్ ,సామ్ సంగ్ లాంటి పెద్ద కంపెనీస్ lg మొబైల్స్ కి మంచి పోటీ ఇస్తున్నాయి . యూరప్ లో lg మొబైల్స్ బిజినెస్ బాగానే ఉంది కానీ ఇప్పుడిపుడే హుఅవెయి కంపెనీ యూరప్ మార్కెట్ మీద కన్ను వేసింది . చూడాలి ఇంత కాంపిటీషన్ ని lg కంపెనీ ఎలా తట్టుకుంటుందో .

lg ఇండియా లో బడ్జెట్ లో ఒక మంచి ఫోన్ తీసుకువస్తే ఇండియన్ మార్కెట్ లో సేల్ ని పెంచుకోవచ్చు . లేకపోతే ఈ చైనా కంపెనీస్ దెబ్బ కి lg మొబైల్స్ ఇండియా మార్కెట్ లో కూడా కనుమరుగు అయిపోతాయి .