జియో ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు పేలిపోయి కాలిపోయింది

జియో ఫోన్ కాశ్మీర్ లో ఛార్జింగ్ పెట్టినప్పుడు కాలిపోయింది . ఈ ఫోన్ ఎందుకు కాలిపోయిందో జియో నుంచి ఇంకా ప్రకటన రాలేదు .

source : phone Radar

జియో ఫోన్ డిస్టిబ్యూటర్స్ దీన్ని పరిశీలించి జియో ఫోన్ బ్యాటరీ మీద ప్రెషర్ వలన కాలిపోయింది అని ప్రకటించారు . ఫోన్ కాలిపోయిన బ్యాటరీ మాత్రం ఇప్పటికి కూడా బాగానే పని చేస్తుంది అని జియో ( లైఫ్) డిస్ట్రిబ్యూటర్స్ చెప్పారు . ఈ ఫోన్ ఎందుకు కాలిపోయింది అన్న విషయాన్ని  జియో త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం వుంది .

 

ఇప్పటికే జియో ఫోన్స్ 6o లక్షలకు పైగా ప్రీ ఆర్డర్ అయ్యాయి . మొదట ప్రీ ఆర్డర్ చేసుకున్న కస్టమర్లు కు జియో ఫోన్స్ ఇప్పుడు డెలివరీ చేస్తున్నారు . జియో ఫోన్ నవంబర్ మొదటి వారం నుంచి రెండవ ప్రీ ఆర్డర్ బుకింగ్స్ స్టార్ట్ చేస్తామని జియో చెప్పింది . ఈ సారి జియో ఫోన్స్ బుకింగ్ చేసుకునే వాళ్ళ సంఖ్య తగ్గవచ్చు .