ఆండ్రాయిడ్ ఫోన్స్ కి కొత్త వైరస్ 232 బ్యాంక్స్ యాప్స్ కి పొంచివున్న ప్రమాదం .

ఆండ్రాయిడ్ కి కొత్త వైరస్ .232 బ్యాంకు యాప్స్ కి పొంచివున్న ప్రమాదం .

దీని లో మన ఇండియా బ్యాంక్స్ కూడా ఉన్నాయి. ఈ వైరస్ పేరు ” ( ఆండ్రాయిడ్ .బ్యాంకర్ .A9480 మాల్వేర్ )” Android.banker.A9480 Malware ” .
 
క్విక్ హీల్ ఇచ్చినా సమాచారం ప్రకారం ఈ వైరస్ మన వ్యక్తిగత సమాచారాన్ని , మన లాగ్ ఇన్ పాస్ వర్డ్స్ ని , మన SMS లను , కాంటాక్ట్ ని దొంగిలిస్తుంది .

ఈ వైరస్ ద్వారా మన ఇండియా బ్యాంక్స్ యాప్స్ కి కూడా ప్రమాదం పొంచివుంది .

      Read In English

 

ఈ Android.banker.A9480  వైరస్ వల్ల ఈ ఇండియా బ్యాంక్స్ యాప్స్ ని టార్గెట్ చేస్తుంది :

 • Axis mobile
 •  HDFC Bank MobileBanking
 • SBI Anywhere Personal
 •  HDFC Bank
 • MobileBanking LITE
 •  iMobile by ICICI Bank
 •  IDBI Bank GO Mobile+
 •  Abhay by IDBI Bank Ltd
 •  IDBI Bank GO Mobile
 •  IDBI Bank mPassbook
 •  Baroda mPassbook
 •  Union Bank Mobile Banking
 •  Union Bank Commercial Clients.

ఈ Android.banker.A9480 వైరస్ ఏ యాప్స్ వల్ల వస్తుంది :

ఈ వైరస్ ఫేక్ ఫ్లాష్ ప్లేయర్ యాప్ ద్వారా వస్తుంది .

 

ఈ Android.banker.A9480  వైరస్ మన మొబైల్ లో ఎలా పని చేస్తుంది :

మీరు వెబ్ సైట్స్ లో పోర్న్ వీడియోస్ గాని ,పైరేటెడ్ మూవీస్ గాని , సాంగ్స్ గాని , క్రాక్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు వాటి తో పాటు ఈ ఫేక్ యాప్స్ కూడా ఇన్ స్టాల్ అవుతుంది .

ఒక సారి యాప్ మీ మొబైల్ లో ఇన్ స్టాల్ అయితే మీ యాప్ యొక్క ఐకాన్ మీ మొబైల్ లో కనిపించదు . 232 బ్యాంకు లో ఏ బ్యాంకు యాప్ మీ మొబైల్ లో ఉందొ ఆయాప్ ని టార్గెట్ చేస్తుంది .

తరువాత ఫేక్ నోటిఫికేషన్ మీకు బ్యాంకు నుంచి వచ్చి నట్లు వస్తుంది . ఆ పాప్ అప్ నోటిఫికెషన్స్ లో మీ బ్యాంకు లాగ్ ఇన్ id & పాస్ వర్డ్ అడుగుతుంది .ఒక సారి మీ వివరాలు హకెర్స్ కి వెళితే మీ మొబైల్ డబ్బులు స్వాహా !!!

Android banker A9480 Malware Targets 232 Banking Apps Including Indian Banks