నోకియా బ్రాండ్ తో HMD గ్లోబల్ ఇప్పటి వరకు ఎన్ని మొబైల్స్ అమ్మింది

నోకియా బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లు తయారుచేయడానికి, మరియు అమ్మడానికి HMD గ్లోబల్ సంస్థ పది సంవత్సరాలపాటు ఒప్పడం కుదురించుకుంది.


HMD గ్లోబల్ కంపెనీ స్వల్ప కాలంలోనే పది లక్షల ఫోన్స్ ని అమ్మింది.
కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ పెక్కా రంటాల, ఒక ఇంటర్వ్యూలో ఈ విధంగా అన్నారు . ఇప్పటి వరకు పది లక్షల నోకియా బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లను విజయవంతంగా అమ్మినట్లు ఆయన చెప్పారు.
నోకియా మొబైల్ సపోర్ట్ అప్లికేషన్స్ డౌన్లోడుల సంఖ్య పది లక్షల నుండి 50 లక్షల వరకు ఉంటుందని సూచిస్తుంది.

నోకియా బ్రాండ్ను పునరుజ్జీవింపజేయడంలో సంస్థ విజయవంతమైందని ఈ సంఖ్యలు సూచిస్తున్నాయి.

డిసెంబరు 2016 లో స్థాపించబడిన HMD గ్లోబల్ పది సంవత్సరాలపాటు నోకియా బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లను తయారు, మార్కెట్ మరియు విక్రయాల హక్కులను పొందింది.

ఈ సంస్థ నోకియా బ్రాండ్ పేరుతో అనేక ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టింది, దానిలో ప్రధాన మోడల్ నోకియా 8 .