ట్రైన్ బుకింగ్స్ కి మార్చి 2018 వరకు సర్వీస్ టాక్స్ లేదు

సాధారణంగా రైల్వేశాఖ irctc లో టికెట్ బుక్ చూస్తే 20 నుంచి 40 రూపాయల వరుకు ఛార్జ్ చేస్తుంది . తాజా సమాచారం ప్రకారం రైల్వేశాఖ ఆన్లైన్ రైల్వే టికెట్ మీద సర్వీస్ టాక్స్ ని మార్చి 2018 వరకు తొలగించింది .

మొదట 1000,500 రూపాయల నోట్లు రద్దు అయినప్పుడు ఆన్లైన్ లావాదేవీలు పెంచడం కోసం అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. తర్వాత దీన్ని రెండు సార్లు పొడిగించారు. ఇప్పుడు కూడా దీన్ని మార్చి వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
దీని వల్ల రైల్వేశాఖ కు కొన్ని కోట్ల రూపాయలు వరకు నష్టం వస్తుంది.