Home వీడియోస్/ ఆర్టికల్స్ ఉపయోగకరమైనవి జురాసిక్ వరల్డ్ ఆలైవ్ గేమ్

జురాసిక్ వరల్డ్ ఆలైవ్ గేమ్

యూనివర్సల్ పోకెమోన్ గో లాంటి ఒక గేమ్ ని ప్రకటించింది . ఈ గేమ్ కి ” జురాసిక్ వరల్డ్ ఆలైవ్ ” అని పేరు పెట్టారు . ఈ గేమ్ లో మీరే సొంత డైనోసార్ ని ఆగ్మెంటేడ్ రియాలిటీ ( augmented reality ) ద్వారా తయారు చేసుకోవచ్చు . ఈ గేమ్ ఆండ్రాయిడ్ , ఐఓఎస్ వినియోగదారులు వాడకోవచ్చు . ఈ గేమ్ వసంత కాలం నుంచి అందుబాటులోకి రానుంది .

Read In English

పోకేమాన్ గో కి , జురాసిక్ వరల్డ్ ఆ లైవ్ గేమ్ కి తేడా ఏమిటి ?

పోకేమన్ గో గేమ్ లో మనం బయటికి వెళ్లి ఆడాలి . కానీ ఈ గేమ్ లో మనం బయటకి వెళ్లము కానీ డ్రోన్స్ సహాయంతో మనం బయటికి వెళ్లి  డైనోసార్ యొక్క  డిఎన్ఏ ని కని పెట్టాలి . డిఎన్ఏ ని ఎక్కువ కనిపెడితే ఆ డిఎన్ఏ సహాయంతో మనం మనకి నచ్చినా డైనోసార్ ని తయారు చేసుకోవచ్చు . ఈ విదంగా మనం తయారు చేసుకున్న డైనోసార్స్ తో వేరొక ప్లేయర్ డైనోసార్ పైన యుద్ధం చేయవచ్చు

ప్రస్తుతం ఈ గేమ్ 100 డైనోసార్స్ మాత్రమే ఉన్నాయి , మిగిలిన డైనోసార్స్ రకాలను అప్డేట్ రూపం లో తీసుకు వస్తామని యూనివర్సల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్ హీథర్ల్య్ తెలిపారు .

పోకే మాన్ గో గేమింగ్ ప్రపంచం లో ఒక సంచలం సృష్టించింది . ఈ పోకే మాన్ గో గేమ్ కి చాల మంది బానిసలూ కూడా అయ్యారు. కొన్ని దేశాలు ఈ పోకీమాన్ గో గేమ్ ని బాన్ చేసాయి . ఇప్పుడు ఈ వసంత కాలం లో జురాసిక్ వరల్డ్ ఆ లైవ్ గేమ్ మార్కెట్ లోకి రానుంది . ఖచ్చితంగా జురాసిక్ వరల్డ్ ఆ లైవ్ గేమ్ గేమింగ్ ప్రపంచం లో రికార్డ్స్ సృష్టించడం ఖాయం.

Also Read: గేమ్ ఆడి కన్ను పోగొట్టుకున్న చైనా యువతి

మరిన్ని టెక్నాలజీ తాజా సమాచారాల కోసం ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ని ఫాలో అవ్వండి .