Home టెక్ న్యూస్ జియో ఫోన్ వినియోగదారులకు శుభవార్త

జియో ఫోన్ వినియోగదారులకు శుభవార్త

JIO phone offer : జియో ఫోన్ వాడే వాళ్లకు జియో ఒక మంచి ఆఫర్ తీసుకువచ్చింది . జియో ఫోన్స్ గత సంవత్సరం లో మార్కెట్ లోకి వచ్చాయి . మార్కెట్ లోకి వచ్చినప్పుడు ఈ ఫోన్స్ కి డిమాండ్ బాగానే ఉంది. రాను రాను ఈ జియో ఫోన్స్ మీద జనాలు ఆసక్తి చూపించడం లేదు . దానికి కారణం ప్రతి నెల 153 రూపాయలు తో మాత్రేమే రీఛార్జ్ చేయించు కోవాలి . మిగిలిన ప్లాన్స్ ఈ మొబైల్ కి పనికి రావు .

                Read In English

జియో ఫోన్స్ కి  డిమాండ్ తగ్గుతున్న కారణం చేత జియో ఈ నెల మొదటిలో 153 రూపాయల ఆఫర్ లో 500 MB /డే ఉన్న డేటా ని 1gb /డే కి చేసింది . అయినా జనాల నుంచి స్పందన రాకపోవడం తో ఇప్పుడు జియో ఫోన్ వినియోగదారుల కోసం 49 రూపాయల ఆఫర్ ని తీసుకువచ్చింది .

 

మీకు జియో ఫోన్ ఉంటే మీరు 49 రూపాయలు రీఛార్జ్ చేయిస్తే మీకు 28 రోజుల వరకు ఆన్ లిమిటెడ్ కాల్స్ మరియు 1GB డేటా పొందవచ్చు . ఈ 1GB డేటా అయిపోయాక మీ ఇంటర్నెట్ స్పీడ్ 2g కి పడిపోతుంది . మీకు 28 రోజుల్లో 1GB డేటా అయిపొయింది అనుకోండి మీరు Rs 11, 21, 51 and 101 వీటిలో ఏదో ఒక దాని తో రీఛార్జ్ చేయించుకొని మీ డేటా ని పెంచుకోవచ్చు .